బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 31 మే 2019 (15:23 IST)

పగడపు గణపతి.. నల్లరాతి గణపతిని పూజిస్తే?

వినాయకుడు సర్వ విఘ్నాలకు అధిపతి. వినాయకుడి కృపా కటాక్షాలు ఉంటేనే తలపెట్టిన ఏ కార్యమైనా నిర్విఘ్నంగా సాగుతుంది. సకల విఘ్నరాజైన పార్వతీ తనయుడి రూప విశేషాలు చాలా విలక్షణమైనవి. 


గణపతిని పూజగదిలో పెట్టుకుని పూజించడం వల్ల అన్ని విధాల శుభం చేకూరి ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ది చెందడమే కాకుండా తమకు ఉన్న సమస్యల నుంచి కూడా సులభంగా బయటపడుతారు. 
 
సహజంగా మనుషులకు అనేక రకాల సమస్యలు ఉంటాయి అయితే ఒక్కో రకమైన సమస్య ఉన్నవారు ఒక్కో రూపంలోని గణపతిని ఆరాధించడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. ఎటువంటి గణపతిని పూజిస్తే ఎటువంటి కష్టాలు తొలగిపోతాయో ఇక్కడ తెలుసుకుందాం:
 
ఎర్ర చందనం గణపతి - అనారోగ్యం నుంచి విముక్తి.
నల్లరాతి గణపతి - అధిక శ్రమనుంచి విముక్తి.
ముత్యపు గణపతి - మానసిక ప్రశాంతత.
సైకతశిల గణపతి - పీడల నుంచి విముక్తి.
పగడపు గణపతి - రుణ విముక్తి.
స్ఫటిక గణపతి - భార్యాపుత్రులతో సుఖజీవనం.
మరకత గణపతి - వ్యాపారాభివృద్ధి.
చందనం గణపతి - ఉద్యోగం, సంఘంలో గౌరవం.
శ్వేతార్క గణపతి - విఘ్న వినాశనం.