గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 15 నవంబరు 2016 (20:20 IST)

అల్లంతో ఆరోగ్యం... ఇది వేటికి మందుగా పనిచేస్తుందో తెలుసా?

ఆహారం సరిపడక పోవడం మూలానా విరోచనాలవుతున్నప్పుడు ఒక టీస్పూన్ అల్లం ముద్దను నీళ్లలో వేసి మరగించి అరచెంచాడు వట్టివేళ్ల చూర్ణంతో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. చెవి నొప్పిగా వున్నప్పుడు అరచెంచాడు శొంఠిచూర్ణాన్ని వేడినీళ్లకు చేర్చి తీసుకోవాలి. ఆకలి లే

ఆహారం సరిపడక పోవడం మూలానా విరోచనాలవుతున్నప్పుడు ఒక టీస్పూన్ అల్లం ముద్దను నీళ్లలో వేసి మరగించి అరచెంచాడు వట్టివేళ్ల చూర్ణంతో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. చెవి నొప్పిగా వున్నప్పుడు అరచెంచాడు శొంఠిచూర్ణాన్ని వేడినీళ్లకు చేర్చి తీసుకోవాలి. ఆకలి లేనప్పుడు భోజనానికి అరగంట ముందు అల్లం ముక్కను సైంధవ లవణంతో అద్దుకుని తినాలి.
 
అల్లం తింటే జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అల్లం కషాయంలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి ఇస్తే త్వరగా మార్పు కనిపిస్తుంది. మూత్రంలో రక్తం కనిపించినప్పుడు పావు చెంచాడు శొంఠిచూర్ణంతో కషాయం కాచి అరచెంచాడు పటిక బెల్లం పొడిని కలిపి పాలు చేర్చి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
 
శరీరంలో వాపులు వున్నప్పుడు, కామెర్లతో బాధపడుతున్నప్పుడూ అల్లం, బెల్లం సమాన భాగాలుగా కలిపి వుండచేసి తగు మోతాదులో తీసుకోవాలి. దగ్గుతో బాధపడేవారు రెండు చెంచాలు అల్లం రసానికి చెంచాడు తేనె చేర్చి తీసుకోవాలి. ఆహారం తీసుకున్న తరువాత కడుపునొప్పితో ఇబ్బందిపడేవారు శొంఠి పొడి, నువ్వులు, బెల్లం కలిపిన ముద్దను పాలతో కలిపి తీసుకుంటే ఉపయోగం వుంటుంది.