సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2019 (15:42 IST)

వెల్లుల్లి రెబ్బలతో ఆస్తమా వ్యాధికి చెక్....

వెల్లుల్లి వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది చూసేందుకు చిన్నదిగా ఉంటుంది.. కానీ చేసే పనులు మాత్రం చాలా పెద్దవి. వెల్లుల్లి లేని వంట అంటూ ఉండదు. దీనితో టీ, కూర, అన్నం వంటి రకరకాల వంటలు తయారుచేస్తారు. వెల్లుల్లి రెబ్బలను నోట్లో పెట్టుకుంటే ఆస్తమా వ్యాధి, దగ్గు వంటి సమస్యలు తగ్గుముఖం పడుతాయి. వెల్లుల్లిలోని మరికొన్ని ప్రయోజనాలు
 
ఆరోగ్యానికి సహకరించే ఎన్నో గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. వెల్లుల్లిని ఆహారంగా తీసుకోకపోయినా, పడుకునే దిండు క్రింద పెట్టుకున్నాసరే ఎన్నో ప్రయోజనాలను కలుగజేస్తుంది. వెల్లుల్లిలో ఉండే వేడి, అరోమా గుణాలు మెదడులోని పలు ప్రాంతాలను ఉత్తేజితం చేస్తుంది. దీంతో నిద్రలేమి దూరమవుతుంది. రోజు దిండు క్రింద ఒక వెల్లుల్లి రేకును పెట్టుకొని పడుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. 
 
జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు దిండు క్రింద వెల్లుల్లిని పెట్టుకొని నిద్రిస్తే చాలు. వెంటనే ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి. రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. లివర్ సంబంధ సమస్యలు దూరమవుతాయి. హోర్మన్ సమస్యలు దూరమై జీవ క్రియలు సక్రమంగా జరుగుతాయి. వెంట్రుకలకు పోషణ సరిగ్గా అందుతుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. బట్టతల సమస్య తొలగిపోతుంది.