సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (12:27 IST)

రోజూ స్పూన్ తేనెలో చిటికెడు కుంకుమ పువ్వు కలుపుకుని?

ఆరోగ్యం కోసం.. ఈ చిట్కాలు పాటించండి. గ్లాసు నీటిలో తులసి, వేపాకులు, మిరియాలు వేసి మరిగించి.. ఆ నీటిని ఉదయాన్ని తాగడం ద్వారా శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ వేడి నీటిని సేవించడం ద్వారా

ఆరోగ్యం కోసం.. ఈ చిట్కాలు పాటించండి. గ్లాసు నీటిలో తులసి, వేపాకులు, మిరియాలు వేసి మరిగించి.. ఆ నీటిని ఉదయాన్ని తాగడం ద్వారా శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ వేడి నీటిని సేవించడం ద్వారా బరువు తగ్గుతారు. ప్రతి రోజు అల్లంతో టీ తాగాలి. దీనివల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపులో మంట, పొట్టకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. 
 
అలాగే  రోజుకు ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలో అంతే మోతాదులో ఉల్లిపాయరసం కలిపి తీసుకుంటే క్రమంగా చర్మం కాంతిమంతమవుతుంది. ప్రతి రోజు కనీసం 6 గ్లాసుల నీళ్లు తాగడం మరిచిపోవద్దు. ఉదయం, సాయంత్రం వేళల్లో కొద్దిసేపు తప్పనిసరిగా నడవాలి. ఇలా చేయడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
 
అంతేగాకుండా.. గోధుమ జావ తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగాలంటే.. ఒక స్పూన్ తేనేలో చిటికెడు కుంకుమపువ్వు కలుపుకుని తీసుకుంటే సరిపోతుంది. ఇలా చేస్తే చర్మానికి ప్రత్యేక నిగారింపు సంతరించుకుంటుంది.