గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జులై 2020 (21:08 IST)

అధిక బరువును తగ్గించే.. పచ్చి కొబ్బరి..

పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప‌చ్చి కొబ్బ‌రిలో కాప‌ర్‌, ఐర‌న్‌, మెగ్నిషియం, మాంగ‌నీస్‌, పాస్ఫ‌ర‌స్‌, పొటాషియం, సెలీనియం, జింక్, విట‌మిన్ బి1, బి5, బి9 త‌దిత‌ర విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. ఇంకా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకునే వారి పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ప‌చ్చి కొబ్బ‌రి మంచి ఆహారంగా చెప్ప‌వ‌చ్చు. 
 
గుండె సంబంధిత సమస్యలున్నవారు పచ్చి కొబ్బరిని తింటూ వుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తసరఫరా మెరుగుపడి హైబీపీ తగ్గుతుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారు పచ్చి కొబ్బ‌రిని తింటే వారి ర‌క్తంలో ఉన్న షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. 
 
ప‌చ్చికొబ్బ‌రిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ప‌చ్చి కొబ్బ‌రి తినాలి. తద్వారీ అజీర్తి, అసిడిటీ తగ్గిపోతుంది.