శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : బుధవారం, 17 జనవరి 2018 (10:52 IST)

మధుమేహ వ్యాధిగ్రస్థులు స్కిన్‌తో పాటు చికెన్ తీసుకోకండి..

మధుమేహ వ్యాధిగ్రస్థులు సాచురేటేడ్ ఫాట్ పదార్ధాలని కలిగి ఉండే మాంసం, చికెన్ స్కిన్, మీగడ తీసివేయని పాలు, ఐస్ క్రీమ్, చీస్, జంక్ ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. స్కిన్ లెస్ చికెన్‌ను వంటకాల్లో చేర్చుకోవా

మధుమేహ వ్యాధిగ్రస్థులు సాచురేటేడ్ ఫాట్ పదార్ధాలని కలిగి ఉండే మాంసం, చికెన్ స్కిన్, మీగడ తీసివేయని పాలు, ఐస్ క్రీమ్, చీస్, జంక్ ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. స్కిన్ లెస్ చికెన్‌ను వంటకాల్లో చేర్చుకోవాలి. అలాగే టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు కనీసం రెండు సంవత్సరాలకి ఒకసారైన తప్పకుండా శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను పరీక్ష చేయించుకుని.. వైద్యుల సలహా మేరకు ఆహారం తీసుకోవాలి. 
 
అలాగే రెండు చెంచాల కరివేపాకు పొడిని ఒక గ్లాస్ నీటిలో మరిగించి చల్లారాక డయాబెటిస్ పేషెంట్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అంతేకాదు తులసి ఆకులను నీటిలో వేసి 15 నిమిషాల తరువాత తాగినా గుణం కనిపిస్తుంది. మెంతుల్ని రాత్రంతా నీళ్లను నానబెట్టి, మరునాడు వడకట్టి తాగాలి. ఇలా రెండు నెలల పాటు చేస్తే ఫలితం ఉంటుంది. వేప ఆకులను కొన్నింటిని తీసుకుని వాటిని ముద్దగా నూరి దాని నుంచి తీసిన జ్యూస్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
 
ఇదేవిధంగా నేరేడు గింజల చూర్ణం ప్రతిరోజు మూడు గ్రాముల చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే మధుమేహవ్యాధికి ఉపశమనం కలుగుతుంది. నారింజ వలన మధుమేహ వ్యాధిగ్రస్థుల రక్తంలో ఉండే కొవ్వు పదార్థాలు కూడా నియంత్రించబడతాయి. గోధుమలు, సజ్జలతో చేసిన వంటకాలు డయాబెటిస్‌ను నియంత్రిస్తాయి. 
 
మధుమేహ వ్యాధి గ్రస్తులు పండ్ల రసాల కంటే పండును వొలిచి తినడం ద్వారా ఎక్కువ ఫైబర్‌ను పొందుతారు. తృణధాన్యాలు, గోధుమలను ఆహారంలో తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.