బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (15:15 IST)

సప్తముఖి రుద్రాక్షను ధరిస్తే..?

ధనం, శాంతి, కోరికలు, విజయాలను సిద్దింపజేయటానికి రుద్రాక్ష ధారణ ఉత్తమ మార్గమని శివ పురాణం చెప్పబడుతోంది. ఈ రుద్రాక్షల్లో ప్రధానంగా నాలుగు రకాలున్నాయి. మొదటిది రుద్రాక్ష, రెండోది భద్రాక్ష, మూడోది సాద్రాక్ష, నాలుగోది రౌద్రాక్ష. వీటిలో ఒక ముఖం నుండి 14 ముఖాలు కలిగినవి సాధారణంగా ఉంటాయి. అయితే అంతకన్నా ఎక్కువ ముఖాలు కలిగినవి కూడా ఉండవచ్చు. రుద్రాక్ష ముఖాలను అనుసరిస్తే ఎన్నో ఫలితాలు ఉంటాయి. 
 
ఏకముఖి రుద్రాక్షను చూడడం వలనే పాపాలు నశించి లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. ద్విముఖిని ధరిస్తే పాపనాశనం కలిగి కోరికలు నెరవేరతాయి. త్రిముఖి రుద్రాక్షను పూజించినా ధరించిన సర్వ కార్యాలు సిద్ధిస్తాయి. చతుర్ముఖి రుద్రాక్షను తాకినా చూసినా సకల పాపాలు నశిస్తాయి. పంచముఖిని ధరిస్తే పాపనాశనం జరిగి మోక్షం కలుగుతుంది. షణ్ముఖి రుద్రాక్షను కుడి భుజాన ధరిస్తే సర్వ పాపాలు నశించి శుభం చేకూరుతుంది. సప్తముఖి ధరిస్తే దారిద్ర్యం నశించి ధనవంతులవుతారు.