శనివారం, 24 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : గురువారం, 23 జులై 2015 (08:19 IST)

ఇంట్లో దీపంతో పుష్కరాలను ముగించండి... రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు

గోదావరి హారతి ఇచ్చే సమయంలో రాష్ట్రంలోని అన్ని ఇళ్లల్లోనూ దీపం వెలిగించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పుష్కరాలకు ఇదే ముగింపు అవుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించనున్నారు. అలాగే, పుష్కరాల తీపిగుర్తుగా దివాన్‌చెరువులో పుష్కర వనాన్ని 26న సీఎం చేతులమీదుగా ప్రారంభిస్తారు. 
 
రాజమండ్రిలో బుధవారం సాయంత్రం గోదావరి హారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. తొలుత, ఘాట్‌లోని గోదావరి మాత, పుష్కరుడు, సింహరాశికి పూజలు నిర్వహించి సంధ్యాహారతి ఇచ్చారు. అనంతరం లక్షలాదిమంది భక్తజనం నడుమ గోదావరి మాతకు సప్తపండితులు నేత్ర, బిల్వ, నాగ, రుద్ర, చక్ర, కుంభ, వృక్ష, సింహ, నంది కర్పూర, నక్షత హారతులిచ్చారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు వీక్షించారు. చివరి రోజున కార్యక్రమానికి యోగాగురువు రామ్‌దేవ్‌బాబా విచ్చేయనున్నారు.