భయపెడుతున్న "క్రాల్" - మొసళ్ళతో మహిళ పోరాటం (CRAWL Trailer)
హాలీవుడ్ అంటేనే జంతువుల నేపథ్యంలో వచ్చే చిత్రాలే ఎక్కువగా ఉంటాయి. తాజాగా పారామౌంట్ పిక్చర్స్ క్రాల్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించింది. మొసళ్ళ నేపథ్యంతో అలెగ్జాండ్రి అజా "క్రాల్" అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నాయి. ఫ్లోరిడా రాష్ట్రంలో వచ్చిన వరదలతో ఇళ్ళన్ని నీటిలో మునుగుతాయి. వరదలతో మొసళ్ళు కూడా ఇళ్ళల్లోకి చేరుతాయి. అయితే ఓ ఇంట్లో మహిళ మొసళ్ళ మధ్య ఇరుక్కుపోతుంది. ఆమెని కాపడడానికి వచ్చిన వారందరు మొసళ్ళకి ఆహారం అయిపోతుంటారు.
ఈ పరిస్థితుల్లో మొసళ్ళ బారి నుంచి ఆ మహిళ ఒక్కరే ఎలా సురక్షితంగా బయటపడిందనే ఈ చిత్ర కథ. ఎంతో ఉత్కంఠని రేకెత్తించనున్న ఈ సినిమాలో క్రెయిగ్ జె ఫ్లోరిస్, శామ్ రైమీలు చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జులై 12వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ ట్రైలర్‌ను 99 లక్షల మంది వీక్షించారు.