శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 నవంబరు 2022 (10:01 IST)

'రుద్రంగి'లో మిరాబాయి దొరసానిగా సీనియర్ హీరోయిన్

rudrangi
విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రం "రుద్రంగి". ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ విమలా రామన్ దొరసాని పాత్రలో నటించారు. మీరాబాయి దొరసాని పాత్రను పోషించగా, ఈ పాత్రను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. 
 
గతంలో తెలంగాణ నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చాయి. తెలంగాణాలో ఒకపుడు గడీల పాలన కొనసాగింది. దొరల ఏలుబడిలో జరిగిన ఘటనలు ఆధారంగా చేసుకుని తెరకెక్కిన కొన్ని చిత్రాలు ప్రేక్షకులను ఆలరించాయి. 
 
అలా దొరల పాలన నేపథ్యంలో రూపొందిన మరో చిత్రం 'రుద్రంగి'. నాయిక ప్రధానమైన కథ అనే విషయం టైటిల్‌లను చూస్తేనే తెలిసిపోతుంది. ఈ సినిమాలో భీమ్ రావ్ దొర పాత్రను పరిచయం చేస్తూ కొన్ని రోజుల క్రితం హీరో జగపతి బాబు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 
 
తాజాగ మీరాబాయి దొరసాని పాత్రలు రివీల్ చేశారు. దొరసాని అలంకరణలో విమలా రామన్ నిండుగా, హుందాగా కనిపిస్తుంది. "కొన్ని ప్రశ్నలకు కాలమే జవాబిస్తుంది తమ్ముడు" అనే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. 
 
మరోకీలకమైన పాత్రలో మమతా మోహన్ దాస్ నటించిన ఈ సినిమాకు అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన, తెరాస ఎమ్మెల్యే, ప్రజా కళాకారాలు రసమయి బాలకిషన్ నిర్మాత.