సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 మే 2021 (22:44 IST)

గోల్డన్ మిల్క్(పసుపు పాల)తో కరోనా చెక్ : ఆయుష్ వెల్లడి (video)

దేశ ప్రజలను పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ వైరస్ అంతానికి ఇప్పటివరకు ఎలాంటి మందులు కనిపెట్టలేదు. కానీ, ఈ వైరస్ రాకుండా వ్యక్తిగత జాగ్రత్తలతో పాటు.. స్వీయ రక్షణ పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేసమయంలో వంటింట్లని పోపు దినుసులతో ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయొచ్చని గృహ ఆరోగ్య నిపుణులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. 
 
అయితే, ఇపుడు ఆయుర్వేదానికి ప్రాముఖ్యత పెరిగింది. గత యేడాదిన్నర కాలంగా ఇది మరింతగా పెరుగుతోంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇంటి నివారణలు, ఆయుర్వేద మందులు తీసుకుంటున్నారు. అయినప్పటికి నిపుణుల సలహా మేరకు అవసరమైనంత వరకే తీసుకోవాలి. 
 
కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడం చాలా ముఖ్యమైనది. రోగనిరోధక శక్తిని పెంచడానికి బంగారు పాలను చాలా ఇళ్లలో వినియోగిస్తున్నారు. వ్యాధులను నివారించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బంగారు పాలను సేవించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది.
 
ఈ పసుపు పాల గొప్పతనం చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ గోల్డెన్ మిల్క్‌కు ప్రాధాన్యత ఉంది. మీడియా నివేదికల ప్రకారం.. పాశ్చాత్య దేశాలలో దీనికి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పాలను రాత్రిపూట సేవించడ వల్ల జలుబు, దగ్గు, శరీర నొప్పులు, గాయాలు వంటి సమస్యలకు చక్కటి పరిష్కారంగా ఉపయోగపడతాయి.
 
పసుపు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. గత సంవత్సరం కరోనా వేవ్ ఉధృతంగా ఉన్నప్పుడు పసుపు పాలు తాగాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. దేశవ్యాప్తంగా 135 ప్రదేశాలలో 104 కి పైగా సామాజిక అధ్యయనాలను నిర్వహించింది. దీని ప్రకారం పెద్ద సంఖ్యలో ప్రజలు దీనిని అవలంభిస్తున్నారు.
 
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉదయం 10 గ్రాముల, ఒక టీస్పూన్ చ్యవాన్‌ప్రాష్, సారం వాడటంపై నొక్కి చెప్పింది. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు హెర్బల్ టీ తాగాలని లేదా తులసి, నల్ల మిరియాలు, దాల్చినచెక్క, అల్లం, ఎండుద్రాక్ష సారం సేకరించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.
 
అలాగే, 150 మి.లీ వేడి నీటిలో అర టీస్పూన్ పసుపు వేసి తాగాలని సూచించారు. అయినప్పటికీ ఇది కరోనా నుంచి రక్షణకు హామీ ఇవ్వదు. కానీ కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడం చాలా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు. కర్కుమిన్ అనే పదార్ధం పసుపులో పెద్ద పరిమాణంలో లభిస్తుంది. చికాకు, ఒత్తిడి, నొప్పి అనేక ఇతర రకాల సమస్యలను తొలగించడానికి దీని చిన్న అణువులు చాలా ఉపయోగపడతాయి.