గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (14:29 IST)

పడకగదిలోని దుమ్మును తొలగించేందుకు...?

ఇంటికి సంబంధించిన అలంకరణలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య దుమ్ముధూళీ.. ఎక్కడ చూసినా తిష్టవేసుక్కూర్చునే ఈ దుమ్ము.. పడకగదిలో చేరిందంటే, దాన్నుంచి బయటపడడం ఎలాగో ఇప్పుడు చూద్దాం..
 
ముందుగా.. అనవసరమైన వస్తువులు ఏమీ లేకుండా పడకగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వార్తా పత్రికలు, పుస్తకాలకు దుమ్ము బాగా పడుతుంటుంది.. కాబట్టి అవి పడకగదిలో లేకుండా చూసుకోవాలి. అలానే పాత బూట్లు, బెల్టులకు బూజు ఎక్కువగా ఉంటుంది.. వాటిని కూడా పడకగదికి దూరంగా ఉంచడం శ్రేయస్కరం.
 
ముఖ్యంగా పడకగదిలోని దుమ్మును తొలగించేందుకు వారానికోసారి వాక్యూమ్ క్లీనర్‌ను వాడితే సరిపోతుంది. పాలియెస్టర్ ఫైబర్ నింపిన దిండ్లు ఎలర్జీలను కలిగించవు కాబట్టి వాటిని వాడవచ్చు. దుమ్మువలన పెరిగే పురుగులు.. పరుపులు, దిండ్లు, తివాచీలు, స్టస్డ్‌టాయ్స్, సోఫాలు, కర్టెన్లలో చేరుతాయి. కనుక వాటిని కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
 
నిద్రించేందుకు దృఢంగా ఉండే యాంటీ ఎలర్జెనిక్ పరుపులు వాడడం మంచిది. అయితే వాటిని కూడా నెలకొకసారి గాలికి ఆరబెట్టి, తిరగేసి వాడుకోవాలి. ఇలా చేయడం వలన పరుపు ఎక్కువగా సాగిపోకుండా ఉండడమేకాకుండా, దుమ్ము పట్టకుండా ఉంటాయి. అలాగే.. దుప్పట్లను బాగా దులిపిన తరువాతనే వాడాలి.
 
సాఫ్ట్ టాయ్స్ వంటి వాటిని తరచుగా శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టాలి. దుమ్ము వలన వచ్చిన పురుగులు ఉన్నాయని అనుమానం వచ్చినట్టయితే వాటిని వారానికి రెండుసార్లు వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయడం ఉత్తమం. అలానే పడకగది తలుపులు పూర్తిగా తెరచి దుమ్ము పోయేటట్లుగా చూడాలి.