1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జూన్ 2014 (17:58 IST)

గోడ మీద మరకల్ని పోగొట్టాలంటే.. ఈ టిప్స్ పాటించండి.!

పెయింట్ వాల్స్ మీద మరకలను తొలగించడం కష్టం. మరకలతో పాటు కొన్ని సందర్భాల్లో ఒరిజినల్ పెయింట్ కూడా తొలగిపోతుంది. మీ ఇంటిని శుభ్రం చేయడానికి నేచురల్ పదార్థాలను ఎంపిక చేసుకోవడం చాలా సులభం. నిమ్మ, వెనిగర్,  బేకింగ్ పౌడర్ వంటివి మీ వంటగదిలో ఖచ్చితంగా ఉండేటటువంటి క్లీనింగ్ ఏజెంట్స్. ఇంట్లో వస్తువు క్లిన్ గా మరియు చూడటానికి అందంగా కనబడాలంటే ఇటువంటి నేచురల్ క్లీనింగ్ వస్తువులు ఇంట్లో ఉండాలి.
 
వెనిగర్ వాల్ పెయింట్ మీద పడ్డ మరకలను తొలగించడానికి వెనిగర్ గ్రేట్‌గా సహాయపడుతుంది. అంతే కాదు, గోడల మీద పడ్డ మరకలతో పాటు, వాసనను కూడా తొలగించడానికి ఎఫెక్టివ్‌గా సహాయపడుతుంది. ఆల్కహాల్‌ను కొద్దిగా కాటన్ వస్త్రం మీద వేసి మరకలున్న వాల్ పెయింట్ మీద సున్నితంగా తుడబాలి. సర్కులర్ మోషన్‌లో తుడవాలి.అవసరం అయితే మరోసారి కూడా ప్రయత్నించవచ్చు
 
బేకింగ్ పౌడర్‌ను నీటితో మిక్స్ చేసి, పేస్ట్‌లా చేసి, ఈ పేస్ట్‌ను పెయిట్ వాల్స్ మీద పడ్డ మరకల మీద అప్లై చేయాలి. 5నిముషాల తర్వాత పొడి బట్టతో తుడివాలి. మరకలు పోయే వరకూ మరో సారి కూడా ప్రయత్నించవచ్చు. లెమన్ పెయింట్ వాల్స్ ప్రకాశవంతంగా మరియు మరకలు లేకుండా కనిపించాలంటే, సిట్రస్ లెమన్‌ను ఉపయోగించవచ్చు. 
 
అందుకు మీరు చేయాల్సిందల్లా, ఒక నిమ్మకాయ రసాన్ని పిండి, అందులో బేకింగ్ పౌడర్ వేసి, ఈ రెండింటి మిశ్రమంతో పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్‌ను మరకలున్నగోడమీద అప్లై చేయాలి. అప్లై చేసిన ఒక గంట తర్వాత సాఫ్ట్ క్లాత్ మరియు స్పాంజ్‌తో తుడిచి శుభ్రం చేయాలి.