శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (09:33 IST)

2 కేజీల చికెన్ ధర కోటి 46 లక్షలు.. ఎక్కడ?

వెనిజులా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. ఫలితంగా దేశ కరెన్సీకి ఏమాత్రం విలువ లేకుండాపోయింది. దీంతో రెండు కేజీల చికెన్ ధర ఏకంగా కోటి 46 లక్షలు పలికింది. అయితే, ఈ ధర మన కరెన్సీలో కాదులెండి. వెనిజులా ద

వెనిజులా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. ఫలితంగా దేశ కరెన్సీకి ఏమాత్రం విలువ లేకుండాపోయింది. దీంతో రెండు కేజీల చికెన్ ధర ఏకంగా కోటి 46 లక్షలు పలికింది. అయితే, ఈ ధర మన కరెన్సీలో కాదులెండి. వెనిజులా దేశ కరెన్సీ లెక్కల్లో.
 
ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశంలో రెండు కేజీల చికెన్ కొనాలంటే అచ్చంగా కోటి 46 లక్షల బాలివర్లు చెల్లించాల్సిందే. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వెనిజులాలో ద్రవ్యోల్బణం శ్రుతి మించడంతో లోకల్ కరెన్సీ అయిన బాలివర్లకు విలువ లేకుండా పోయింది. 
 
అంటే, అమెరికా కరెన్సీలో అది 2.22 డాలర్లు కాగా, మన కరెన్సీలో అయితే ఓ 150 రూపాయలు మాత్రమే. అంతే! అందుకే చిన్నచితకా నోట్లను జనం చెత్తకుండీల్లో వేస్తున్నారు. దేశం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ ఓ చికెన్ షాపు యజమాని మాత్రం తనలోని కళాత్మకను ప్రదర్శిస్తూ ఓ బోర్డును పెట్టాడు.