శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 5 జనవరి 2018 (14:36 IST)

నయగారా జలపాతం... ఇప్పుడు ఏమైందో తెలుసా?

ప్రతిరోజూ 3,000 టన్నులకు మించిన నీటి ప్రవాహం నయగారా జలపాతం నుంచి ప్రవహిస్తుంటుంది. ఐతే ఈ శీతాకాలంలో హఠాత్తుగా పరిస్థితి మారిపోయింది. మైనస్ మైనస్‌ 89 డిగ్రీలకు పడిపోవడంతో అమెరికాలో విపరీతమైన చలి. అమెరికా గడగడ వణికిపోతోంది. మరోవైపు అందాలను ఆరబోసే నయగార

ప్రతిరోజూ 3,000 టన్నులకు మించిన నీటి ప్రవాహం నయగారా జలపాతం నుంచి ప్రవహిస్తుంటుంది. ఐతే ఈ శీతాకాలంలో హఠాత్తుగా పరిస్థితి మారిపోయింది. మైనస్ మైనస్‌ 89 డిగ్రీలకు పడిపోవడంతో అమెరికాలో విపరీతమైన చలి. అమెరికా గడగడ వణికిపోతోంది. మరోవైపు అందాలను ఆరబోసే నయగారా జలపాతం కాస్తా మంచుగడ్డలా కనిపిస్తోంది. 
 
విపరీతమైన చలి, ధారాపాతంగా మంచుతో రోడ్లన్నీ కనీసం 4 నుంచి 6 సెంటీమీటర్ల మంచుతో పూడుకుని పోతున్నాయి. అతి సుందరమైన నయాగరా జలపాతం రకరకాల వెలుగుల కాంతుల్లో ఎంతో అందంగా వుండాల్సింది నీటి ధారకు బదులు ఐసుముక్కలను జారిపడవేస్తూ తన అందాలను మరో రూపంలో చూపిస్తోంది. 
 
గత యాభై ఏళ్ళలో ఇంతటి శీతలం ఇదే మొదటిసారని వాతావరణ నిపుణులు చెబుతుండగా, ఇది గ్లోబల్ వార్మింగ్ కు ఓ సంకేతమంటూ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా ఇది 220 మిలియన్ల మంది అమెరికన్లకు అత్యంత చల్లనైన సంవత్సరం కాబోతోందని అంటున్నారు.