మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (22:39 IST)

కీవ్ నగరంలో కర్ఫ్యూ- మేయర్ ఆదేశాలు

curfew
ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ విధిస్తూ కీవ్ మేయర్ ఆదేశాలు జారీ చేశారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఎవరూ కూడా రోడ్లపైకి రావొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. 
 
సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఉక్రెయిన్ కీవ్ మేయర్ తెలిపారు. రోడ్లపైకి వచ్చిన వారందరినీ శత్రువుగానే పరిగణిస్తామని కీవ్ మేయర్ స్పష్టం చేశారు.  
 
కీవ్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు నగరాన్ని చుట్టుముట్టాయి. రష్యాకు దీటుగా జవాబిచ్చేందుకు ఉక్రెయిన్ బలగాలు ప్రణాళిలు సిద్ధం చేస్తున్నాయి. 
 
కీవ్ నగరం చుట్టూ కీలక పాయింట్లను ఉక్రెయిన్ తమ నియంత్రణలోకి తీసుకుంది. కీవ్ నగరంపై ఇంకా పట్టును కోల్పోలేదని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. యుక్రెయిన్ సైన్యంతో పాటు నగర పౌరులు కూడా కూడా యుద్ధంలో పాల్గొనాలని జెలెన్ స్కీ పిలుపునిచ్చారు.