శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (14:28 IST)

కరోనా పురుషులకే వస్తుందట.. మహిళలకు కోవిడ్ రాదట.. కారణం?

కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణ కొరియా లాంటి దేశాల్లో పురుషులతో పాటు మహిళల్లో కూడా కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. కానీ మరణించిన వారిలో పురుషులే ఎక్కువమంది ఉన్నారు. ఈ వ్యత్యాసానికి జన్యుపరమైన కారణాలు ఉన్నాయని కెనడా ఫిజీషియన్‌, అరుదుగా వచ్చే వ్యాధులపై అధ్యయనం చేసిన డాక్టర్‌ షరోన్‌ మోలెమ్ అన్నారు‌. ముఖ్యంగా మహిళల్లో ఉండే ఎక్స్‌, ఎక్స్‌ క్రోమోజోమ్‌లు కరోనాను సమర్థంగా ఎదుర్కోవడానికి వారికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు. 
 
కాగా.. పురుషుల్లో ఎక్స్‌, వై క్రోమోజోమ్‌లు ఉంటాయి. కానీ మహిళల్లో ఎక్స్‌, ఎక్స్‌ క్రోమోజోమ్‌లు ఉంటాయి. మెదడుకు సంబంధించిన ముఖ్యమైన జన్యువులు ఎక్స్‌ క్రోమోజోమ్‌లోనే ఉంటాయి. అదీగాక మనిషి జీవించడానికి కూడా వై క్రోమోజోమ్‌ కంటే ఎక్స్‌ క్రోమోజోమే అత్యంత కీలకం. పురుషుల్లో కండబలం, శారీరక బలం ఉంటుంది. 
 
కానీ దీర్ఘకాలం జీవించడానికి వీటికంటే ఎక్స్‌ క్రోమోజోమ్‌లే ఎక్కువగా దోహదం చేస్తాయి. మహిళలకు ఇది పుట్టుకతో సహజంగా వచ్చే ప్రయోజనం. ఈస్ట్రోజన్‌ వల్ల కూడా మహిళల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మరోవైపు.. పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ రోగనిరోధకతను తగ్గిస్తుందని డాక్టర్‌ షరోన్‌ చెప్పారు.