శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (07:40 IST)

భారత్-పాకిస్థాన్​ అణుకేంద్రాల సమాచార మార్పిడి

భారత్​-పాకిస్థాన్​ పరస్పరం అణు కేంద్రాల సమాచారాన్ని అందజేసుకున్నాయి.1991లో అమలులోకి వచ్చిన ఒప్పందం ప్రకారం కొత్త సంవత్సరం తొలి రోజే ఈ ప్రక్రియ పూర్తి చేశాయి ఇరుదేశాలు.

29 ఏళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త సంవత్సరం తొలి రోజున భారత్‌, పాకిస్థాన్‌లు అణు కేంద్రాల సమాచారం ఇచ్చిపుచ్చుకున్నాయి. అణు కేంద్రాలపై పరస్పరం దాడి చేసుకోకుండా ఇరుదేశాల మధ్య 1988లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. 1991 నుంచి అది అమలులోకి వచ్చింది.

ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు ప్రతి సంవత్సరం తొలి రోజు అణు కేంద్రాల సమాచారాన్ని పరస్పరం అందజేసుకుంటున్నాయి. ఈ సారి కూడా దౌత్య మార్గంలో రెండు దేశాల మధ్య ఏక కాలంలో ఈ ప్రక్రియ పూర్తయినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.