శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 మే 2020 (16:41 IST)

శుభవార్త చెప్పిన ఇజ్రాయేల్ : ఇక కరోనా వైరస్‌కు మూడినట్టే....

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇక మూడినట్టే. ఈ వైరస్ బారినపడిన అనేక దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్‌ను అంతమొందించేందుకు సరైన మందు లేకపోవడంతో వైరస్ రోజురోజుకూ వ్యాపిస్తోంది. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రపంచానికి ఓ శుభవార్త చెప్పింది. తాము కరోనాను అడ్డుకునేందుకు మోనోక్లోనాల్ న్యూట్రలైజింగ్ యాంటీబాడీని తయారు చేసినట్టు ప్రకటించింది. ఇది శరీరంలోకి వ్యాపించిన వైరస్ ప్రభావాన్ని న్యూట్రలైజ్ చేస్తుందని తెలిపింది. 
 
ఇజ్రాయేల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఇజ్రాయేల్ ఇనిస్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ రీసెర్చ్ (ఐఐబీఆర్) కలిసి ఈ శుభవార్తను వెల్లడించాయి. కరోనా వైరస్ బారినపడి రోగుల శరీరంలోకి ఈ యాంటీబాడీస్‌ను పంపించినట్టయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకుని నియంత్రిస్తుందని తెలిపాయి. ఇది ప్రయోగపూర్వకంగా నిరూపణ అయినట్టు పేర్కొన్నాయి. ఇపుడు ఇతర ఫార్మా కంపెనీలు ముందుకు వచ్చి ఈ యాంటీబాడీస్‌ను తయారు చేయాలని ఐఐబీఆర్ కోరాయి.