బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 జులై 2024 (22:31 IST)

భార్యను తెలివి తక్కువ దద్దమ్మ అని పిలిచిన భర్త... పెళ్లి జరిగిన మూడు నిమిషాల్లోనే విడాకులు...

marriage
కట్టుకున్న భార్యను తెలివి తక్కువ దద్దమ్మ అంటూ భర్త కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన భార్య... విడాకులు కోరారు. ఆ వెంటనే కోర్టు కూడా కేవలం మూడు నిమిషాల్లో విడాకులను మంజూరు చేసింది. ఈ ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గల్ఫ్ దేశం కువైట్‍‌లో ఓ జంట పెళ్లైన 3 నిమిషాలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. పెళ్లి పూర్తయి భార్యాభర్తలుగా మారాక పెళ్లి వేడుక నుంచి వెళుతున్న సమయంలో వధువు బ్యాలెన్స్ తప్పి పడిపోయింది. అయితే, పక్కనే ఉన్న వరుడు తెలివి తక్కువ దద్దమ్మ అని అసహనం వ్యక్తం చేశాడు. ఈ మాట విన్న పెళ్లి కుమార్తె ఆ క్షణమే అతడికి ఇవ్వాలని నిర్ణయించుకుంది. పెళ్లి రద్దు చుసుకుంటున్నానని ప్రకటించి, కోర్టుని ఆశ్రయించింది. లాంఛనమైన విచారణ ముగిసిన తర్వాత కోర్టు విడాకులు మంజూరు చేసింది. కువైట్ చరిత్రలోనే అతి స్వల్పకాల పెళ్లిగా దీనిని చెబుతుంటారు. 
 
నిజానికి 2019లో జరిగిన ఈ ఘటన తాజాగా వైరల్‍‌గా మారింది. తాను ఒక వివాహానికి వెళ్లానని, అక్కడ పెళ్లి కూతురుని వరుడు ఎగతాళి చేస్తూ గడిపాడని, ఆమె కూడా ఆ మహిళలా విడాకులు ఇచ్చి ఉండాల్సిందంటూ ఓ వ్యక్తి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టడంతో నాటి ఘటన మరోసారి వైరల్ అయింది. గౌరవం లేకపోవడంతో పెళ్ళిలో తొలి వైఫల్యమని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. పెళ్లి మొదట్లో ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తులను వదిలివేయడంత మంచిదని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.