భారత్‌కు పాకిస్థాన్ సంఘీభావం.. కరోనా మంచి పని చేసిందిగా..?!
కోవిడ్‌పై భారత్ చేస్తున్న పోరాటానికి పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సంఘీభావం తెలిపారు. కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.. అన్ని దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినా.. భారత్‌లో కోవిడ్ విలయమే సృష్టిస్తోంది.. ఈ తరుణంలో మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడదాం అంటూ.. భారత్‌కు పిలుపునిచ్చారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
పొరుగు దేశాలు, ప్రపంచంలో ఈ వ్యాధి బారిన పడినవారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ సోషల్ మీడియాలో వేదికగా పేర్కొన్నారు ఇమ్రాన్. ఆయన ట్వీట్‌ను పరిశీలిస్తే.. భారత్ కోవిడ్-19 ప్రభంజనంతో యుద్ధం చేస్తోంది.
భారత్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నాను.. పొరుగు దేశాలు, ప్రపంచంలో ఈ మహమ్మారి బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.. మానవాళి ఎదుర్కొంటున్న ఈ అంతర్జాతీయ సవాల్‌పై మనమంతా కలిసికట్టుగా పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు. ఎప్పుడూ పొరుగు దేశంపై కారాలు మిరియాలు నూరే పాకిస్థాన్ కరోనా విషయంలో మాత్రం సంఘీభావం తెలపడంపై భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది.