సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 7 జులై 2020 (08:17 IST)

అమరావతి ఉద్యమానికి అమెరికా తెలుగు ఎన్ఆర్ఐ అసోషియేషన్ మద్దతు

అమెరికాలోని మిన్నియాపాలిస్ నగరంలో తెలుగు ఎన్ఆర్ఐ అసోషియేషన్ అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపింది.  ప్లకార్డులు చేతపట్టి 'జై అమరావతి.. ఆంధ్రులంతా ఒక్కటే...ఆంధ్రుల రాజధాని ఒక్కటే, అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ' నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ... 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం, 3 రాజధానుల వల్ల  ప్రభుత్వానికి ఖర్చు తప్ప  ప్రజలకు ప్రయోజనం శూన్యం. ఒక రాజధానితోనే రాష్ర్టాభివృద్ది సాధ్యం.

200 రోజులకు పైగా  అలుపెరగక అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులకు అభినందనలు. రాజధానికి భూములిచ్చిన రైతులకు మేం అండగా ఉంటాం.

అమరావతే రాజధానిగా ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు అమరావతి ఉద్యమంలో భాగస్వాములుగా ఉంటామని తెలిపారు.