సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 3 మే 2021 (13:34 IST)

గాయాలకు చికిత్స కోసం తీసుకెళితే ఐపీఎల్ ఆటగాళ్లకు కరోనా పట్టుకుంది

ఐపీఎల్ అభిమానులకు షాకింగ్ వార్త. కోల్ కతా జట్టులో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కి కరోనా సోకింది. దీనితో ఈరోజు రాత్రికి జరగాల్సిన కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ వాయిదా పడనుంది.
 
వాస్తవానికి వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ గాయపడ్డారు. ఆ గాయాలకు చికిత్స చేయించేందుకు ఆసుపత్రిలో స్కానింగ్ కోసం తీసుకుని వెళ్లారు. వారికి అక్కడ కరోనావైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. కాగా దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ మీడియాలో ప్రచారం జరుగుతోంది.