బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2024 (17:09 IST)

మయాంక్ యాదవ్‌వా మజాకా.. 155.8 kmph వేగంతో దూసుకెళ్లింది..

Mayank Yadav
Mayank Yadav
ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు విజయానికి యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ సహకరించాడు. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 19.4 ఓవర్లకు కేవలం 153 పరుగులకే ఆలౌట్ అయింది. 
 
ఈ మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బంతులతో బెంగళూరు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మయాంక్ నాలుగు ఓవర్లు వేసి కేవలం 14 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.  ఐపీఎల్‌లో మయాంక్‌కు ఇది రెండో మ్యాచ్. 
 
తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టుపై అద్భుత బౌలింగ్ చేశాడు. మయాంక్ తొలి నుంచి నిలకడగా 145కెఎంపీహెచ్ కంటే ఎక్కువ వేగంతో బంతులు వేశాడు. 
 
ఒక దశలో మయాంక్ వేసిన బంతి 155.8 కెఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్లింది. ఈ ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన బంతి ఇదే కావటం విశేషం. తాజాగా ఆ రికార్డును తను ఆడిన రెండో మ్యాచ్ ఆర్సీబీపై బద్దలు కొట్టాడు.