బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (23:29 IST)

ఐపీఎల్ 2022 వేలంలో సచిన్ కుమారుడికి చోటు దక్కేనా?

ఐపీఎల్ 2022 వేలంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఉన్నాడు. గత సీజన్‌లో అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసినా, ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. 
 
ఈసారి వేలంలో రూ.20 లక్షల కనీస ధరతో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఫిబ్రవరి రెండో వారంలో వేలం ప్రక్రియ జరగనుండగా, అర్జున్ టెండూల్కర్‌ను కొనుగోలు చేసే అంశం కూడా ఆసక్తి కలిగిస్తోంది. 
 
దేశవాళీ క్రికెట్‌లో సగటు ఆటగాడిగానే కొనసాగుతున్న 22 ఏళ్ల అర్జున్.. జూనియర్ ఆటగాడి ముద్ర నుంచి బయటపడలేదు.