1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (15:35 IST)

ఐపీఎల్ 2022: అద్భుతమైన యార్కర్... 139 కి.మీ స్పీడ్‌తో..? (video)

Mukesh Choudhary
Mukesh Choudhary
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే యువ పేసర్ ముఖేష్ చౌదరి అదరగొట్టాడు. అద్భుతమైన యార్కర్ మెరిశాడు. 
 
తొలి ఓవర్ రెండో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను కూడా ముఖేష్ చౌదరి పెవిలియన్‌కు పంపాడు. ముంబై ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో ముఖేష్ చౌదరి వేసిన ఐదో బంతికి కిషన్‌ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు.
 
అయితే బంతి మిస్స్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. అంతేకాకుండా 139 కి.మీ స్పీడుతో ముఖేష్ చౌదరి వేసిన బంతిని ఆపలేక కిషన్ కింద పడిపోయాడు. దీంతో కిషన్ గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.