బుధవారం, 6 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఏది నిజం
  3. ఇదీ సంగతి
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (07:37 IST)

చదువుని సరస్వతీ యాగము అంటారెందుకు?

సరస్వతీదేవి వెనక లక్ష్మీదేవి రావచ్చునేమో కాని లక్ష్మి వెనక సరస్వతి రావడము అరుదుగా జరుగుతుంద ... అని అంటారు. ఒక పూట అన్నం పెడితే ఆకలి తీరుతుంది.

బట్టలిస్తే ఒళ్ళు కప్పుకోవచ్చు , అదే విద్యాదానము చేస్తే పదితరాలకు ఆ కుటుంబలోని అందరూ విద్యావంతులవుతారు. అన్నిదానాల్లో విద్యాదానము ఉత్తమోత్తమైనది. అందుకే గురువు తల్లిదండ్రులతో సమానము.
 
ఈనాడు అన్ని వస్తువులాగానే విద్యకూడా ఖరీదైపోయింది. ప్లేస్కూల్ నుండి కాలేజీ చదువుల దాకా ఫీజులు చుక్కల్ని చూపిస్తున్నాయి.

తమ పిల్లలు చదుకుని మంది స్థితికి రావాలని బీదా బిక్కీ నుంచి సంపన్నుల వరకూ అందరూ ఆశపడుతున్నారు . రిక్షాలాగే వాడి కొడుకు ఎమ్‌.ఎ చదవడం , కండక్టర్ కొడుకు కలెక్టర్ , కానిస్టేబుల్ కొడుకు డిస్టిక్ జడ్జి అవడం వంటి తీపి / చేదు వార్తలు వింటున్నాము.

ప్రభుతం కూడా  "సరస్వతీ నిధి" అన్న పథకాన్ని ప్రారంభంచింది . పేద పిల్లలకు చదివించేందుకు ఈ నిధి ని వాడుతున్నారు.
 
మనదేశము లో నిరక్షరాస్యత , పేదరికము తగ్గించండానికి అందరూ అలోచించి ఆచరణలో పెట్టడాన్నే " సరస్వతీ యజ్ఞం లేదా సరస్వతీ యాగం " అని అంటారు . మీరూ విద్యాదానము చేసి సరస్వతీ యాగము లో పాలు పంచుకోంది.