సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్

యాపిల్ ఆవిష్కరించనున్న కొత్త ప్రాజెక్టులివే...

యాపిల్ సంస్థ త‌న కొత్త ఉత్ప‌త్తుల‌ను ఆవిష్కరించనుంది. ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ మినీ, ఎయిర్‌పాడ్స్‌కు చెందిన అప్‌డెట్స్‌ను ఈ నెల 20వ తేదీన  యాపిల్ రిలీజ్ చేయ‌నుంది. స్ప్రింగ్ లోడెడ్ ట్యాగ్‌లైన్‌తో ఈనెల 20వ తేదీన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. 
 
యాపిల్‌కు చెందిన సిరి .. యూజ‌ర్ల‌తో మాట్లాడుతూ ఆ తేదీని ప్ర‌క‌టించింది. ఈ ఏడాది ఐప్యాడ్ లైన‌ప్‌ను పూర్తిగా అప్‌డేట్ చేయాల‌ని యాపిల్ భావిస్తున్న‌ది. దానిలో భాగంగా ఐప్యాడ్ ప్రోను.. సూప‌ర్ బ్రైట్ ఎల్ఈడీ డిప్లేతో రిలీజ్ చేయ‌నున్నారు. 
 
రీ డిజైన్ చేసిన మినీ ఐప్యాడ్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేయ‌నున్నారు. నెక్ట్స్ జ‌న‌రేష‌న్‌కు చెందిన ఎయిర్‌పాడ్స్ 3 డిజైన్‌ను కూడా రిలీజ్ చేస్తున్నారు. మ్యాక్‌బుక్ ప్రో, మ్యాక్‌బుక్ ఎయిర్‌ల‌ను కొత్త లుక్‌లో రిలీజ్ చేయ‌నున్నారు.