బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (17:04 IST)

చైనాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఫైర్.. టిక్ టాక్ సంగతేంటి?

చైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకిన కరోనా వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. దీంతో చైనాపై ప్రపంచ దేశాలు గుర్రుగా వున్నాయి. వారి ఆహార అలవాట్ల కారణంగానే కరోనా అనే వైరస్ ప్రపంచానికి చుక్కలు చూపిస్తుందని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలోని 200 దేశాలకు పాకి ప్రజలను వేధిస్తోంది. ఇప్పటికే 70 వేల మందికిపై ప్రజలు ఈ వ్యాధికి బలయ్యారు. 
 
ఈ ప్రమాదానికి చైనా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ప్రపంచ దేశాధినేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా చైనాకు వ్యతిరేకంగా అభిప్రాయాలను సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనా ఉత్పత్తులను నిషేధించాలనే వాదన మరోసారి తెరపైకి వస్తోంది. 
 
చైనా యాప్ అయిన టిక్ టాక్‌ను దేశంలో బ్యాన్ చేయాలని కొందరు భారతీయ నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక టిక్ టాక్‌కు ఉన్న కస్టమర్లలో సగం మంది భారతీయులే. ఓ భారత కస్టమర్‌ సగటున 52 నిమిషాలు యాప్‌లో గడుపుతాడని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.