శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (19:23 IST)

రూ.549 లకే Samsung Galaxy F23 5G.. ఎలాగంటే?

Samsung Galaxy F23 5G
Samsung Galaxy F23 5G
పొదుపు చేయడం అంటే అందరికీ ఆనందమే. ప్రత్యేకించి రూ. 23,999 విలువైన ఫోన్‌ను కేవలం రూ. 549కి కొనుగోలు చేయగలిగితే.. ఇంకేముంది.. ఎంగిరి గంతేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అవును మీరు చదువుతున్నది నిజమే. ఫ్లిప్‌కార్ట్‌లో, అనేక స్మార్ట్‌ఫోన్‌లు చౌకగా ఉంటాయి.
 
అలాగే ఎక్స్‌ఛేంజ్, బ్యాంక్ డిస్కౌంట్‌లు కూడా ఉన్నాయి. ఈ డీల్‌లు ఫీచర్-రిచ్ పరికరాన్ని గణనీయంగా తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి సహకరిస్తాయి. తాజాగా Samsung Galaxy F23 5G ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. రూ. 23,999 ఖరీదు చేసే ఈ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 549కి అందుబాటులో ఉంది. Samsung Galaxy F23 5G ఆఫర్‌లను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. 
 
Samsung Galaxy F23 5G ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15999కి అందుబాటులో ఉంది. ఫోన్ అసలు ధర రూ.23,999. ఇది 8 శాతం తగ్గింపుతో లభిస్తుంది. Flipkartలో, మీరు కార్డ్‌లను ఉపయోగించడం వల్ల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 
 
కస్టమర్ Samsung Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం తగ్గింపు, SBI క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు, Flipkart Axis బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పై స్లైడ్‌లో చర్చించినట్లుగా, ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 15,999కి అందుబాటులో ఉంది. అలాగే Samsung Galaxy F 23 5Gని రూ.549లతో  తీసుకోవచ్చు.
 
తద్వారా రూ.15450 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇప్పుడు ఫోన్ ధర రూ.549కి తగ్గింది. Samsung Galaxy F23 5G 6.6 FHD+ డిస్‌ప్లే, 5,000 mAh బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫోన్ 50 MP ప్రైమరీ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.