శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 జనవరి 2023 (16:22 IST)

ఐక్యూ నుంచి కొత్త ఫోన్... కె ఈ6 ప్యానెల్‌తో తొలి స్మార్ట్‌ఫోన్

iQOO 11
iQOO 11
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ ఐక్యూ నుంచి కొత్త ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. భారత  వినియోగదారుల కోసం అమేజాన్‌లో రూ.వెయ్యి ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ప్రకటించింది. 2కె ఈ6 ప్యానెల్‌తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదేనని సంస్థ తెలిపింది. 
 
ఐక్యూ11 పేరుతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో వుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ సామర్థ్యంతో విడుదలైన వేరియంట్ ధరను కంపెనీ రూ.59,999 గా నిర్ణయించింది.
 
స్పెసిఫికేషన్స్: 
16జీబీ ర్యామ్, 
256 స్టోరేజీ స్మార్ట్ ఫోన్ ధర రూ.64,999. 
120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ స్నాపర్
6.78 ఇంచుల అమో ఎల్ఈడీ, 
144 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్.