సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (13:38 IST)

హనుమాన్ దీక్ష చేస్తున్న నితిన్..ఎందుకు??

టాలీవుడ్ యాక్టర్ నితిన్ హనుమాన్ దీక్ష చేస్తున్నట్లు ట్విట్టర్‌లో తెలిపాడు. దీక్ష చేయడం వల్ల తాను ప్రశాంతంగా ఉన్నట్లు పేర్కొన్నాడు, ఉదయాన్నే 5 గంటలకు లేచిన తనకు ఆంజనేయం సాంగ్స్‌తో రోజు ప్రారంభమవుతుందని అన్నాడు. పూజా కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నట్లు స్పష్టం చేసాడు. ఆధ్యాత్మికతతో కూడిన వైబ్స్ తనలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ట్వీట్‌లో తెలిపాడు.
 
సినిమాల విషయంలో వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న ఈ హీరో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. లై, చల్ మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే త‌మిళ సూప‌ర్ హిట్ రీమేక్‌లో న‌టించనున్నాడట. 
 
గతేడాది ఇండియాలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన చిత్రాల‌లో రెండ‌వ స్థానంలో నిలిచిన రాక్షసన్ అనే తమిళ చిత్రాన్ని రీమేక్ చేయనున్నాడట. ఈ చిత్రం తెలుగు హ‌క్కుల‌ని నితిన్ ద‌క్కించుకున్నాడ‌ని తెలుస్తుండ‌గా, దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. మరోవైపు తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఎఫ్2 చిత్రం సీక్వెల్‌లో రవితేజకి బదులుగా నితిన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై దిల్ రాజు మరింత స్పష్టతను ఇవ్వాల్సి ఉంది.