ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (16:43 IST)

కరోనా వల్ల లాక్ డౌన్.. ఇంట్లో సినిమాలు చూస్తున్నారా?

లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే వుంటూ హెచ్డీ టెక్నాలజీతో సినిమాలు చూస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. ఇందుకు కూడా కరోనానే కారణం. కరోనా వల్ల హెచ్‌డీ క్వాలిటీ రాకపోడం అనేది వినడానికి కాస్త వింతగా ఉన్నా, ఇదే వాస్తవం. ప్రస్తుతం భారతదేశం మొత్తం లాక్ డౌన్ చేయడం వల్ల అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగులు వర్క్ ఫ్రొం హోమ్ చేయడం వల్ల డేటా వినియోగం ఎక్కువైంది. 
 
దీని వల్ల ఇంటర్నెట్ వాడకం అంతకముందు కంటే రెట్టింపయ్యింది. ఫలితంగా నెట్‌వర్క్ సంస్థలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డేటాకు డిమాండ్ పెరుగుతున్న కారణంగా అన్ని టెలికాం సంస్థలు సమావేశమైనాయి. 
 
ఈ సమావేశంలో భాగంగా కంపెనీలు డిఫాల్ట్‌గా ఇచ్చే హెచ్‌డీ కంటెంట్, అల్ట్రా హెచ్‌డీ కంటెంట్‌ను ఎస్‌డీ కంటెంట్‌కు మార్చాలని, అలాగే సెల్యులార్ నెట్వర్క్‌లో 480పీ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించాయి. లాక్ డౌన్ ముగిసే వరకు అంటే ఏప్రిల్ 14 వరకు ఈ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించాయి.