సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (16:12 IST)

నోకియా నుంచి నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్.. ధరెంతో తెలుసా?

Nokia 5.3
నోకియా నుంచి నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ కంపెనీ ఇండియా అధికారిక వెబ్ సైట్లో లిస్ట్ అయింది. అందుకే ఈ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి రానుందని వార్తలు వస్తున్నాయి. మార్చిలోనే ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్ జరిగింది.
 
నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ వుంది. అలాగే 6.55 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. సియాన్, శాండ్, చార్ కోల్ రంగుల్లో ఇది రానుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ వెనక భాగంలో అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 
 
ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే.. వెనక వైపు నాలుగు కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలానే బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర అంతర్జాతీయ మార్కెట్లో 189 యూరోలుగా (సుమారు రూ. 15,080) ఉంది.