1500 మంది ఉద్యోగులపై వేటు... అంతా ఖర్చు తగ్గించడానికే..: ఓఎల్ఎక్స్
ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఆన్ లైన్ ట్రేడింగ్ కంపెనీ ఓఎల్ఎక్స్ కూడా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో 10వేల మంది పనిచేయగా.. 15 శాతం అంటే 1500 మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది.
ఇందులో భారత్ లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం వున్నారు. అయితే వీరిలో ఎంతమందిని తొలగిస్తున్నారనేది ఇంకా తెలియరాలేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.
ఆర్థిక పరిస్థితుల కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఓఎల్ఎక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ సంస్థను 2009లో ప్రారంభించారు.
ప్రస్తుతం ఆన్ లైన్ సెకండ్ హ్యాండ్ వస్తువుల విక్రయంలో అగ్రస్థానంలో వుంది. ఇక ఓఎల్ఎక్స్ 2020 జనవరిలో ఓఎల్ఎక్స్ ఆటో పేరిట ప్రీ-ఓన్డ్ కార్ల వ్యాపారాన్ని ప్రారంభించింది.