శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 మే 2021 (12:47 IST)

ఒప్పో నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌.. మే 2న ఫ్లిఫ్ కార్టులో సేల్ ప్రారంభం

OPPO A53s
ఒప్పో నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. బడ్జెట్‌ ధరలో.. అదీ సుమారు రూ.15 వేలకే సంస్థ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. మే 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చని ఒప్పో ప్రకటించింది. ఒప్పో ఏ53ఎస్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 
 
6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వెర్షన్‌ ధర రూ.14,990 నుంచి ప్రారంభమవుతోంది. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ వేరియంట్‌ ధర రూ.16,990గా ఉంది. ప్రారంభ ఆఫర్‌ కింద హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌, ఈఎంఐ ట్రాన్సాక్షన్ల మీద రూ.1250 వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నారు. మొబైల్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు కూడా ఉన్నాయి.
 
ఒప్పో ఏ53ఎస్‌లో 6.52 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో, రిజల్యూషన్‌ 720×1600 పిక్సెల్స్‌తో లభిస్తోంది. దీని స్క్రీన్‌ టు బాడీ రేషియో 88.7 శాతం, స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేట్‌ 60 హెర్జ్‌గా ఉంది. టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ కూడా అంతే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్‌ డైమన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 
 
2.2 జీహెచ్‌జెడ్‌ క్లాక్‌ స్పీడ్‌, మాలి జీ57 జీపీయూ, 6 జీబీ ర్యామ్‌, 8 జీబీ ర్యామ్‌ వెర్షన్లతో డివైజ్‌ను అభివృద్ధి చేశారు. 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉంటుంది. మెమొరీ కార్డుతో 1 టీబీ వరకు స్టోరేజీని పొడిగించుకోవచ్చు. ఏ 53 ఎస్‌ అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
 
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, 10 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, 13 మెగాపిక్సెల్ మెయిన్‌ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా.. వంటి ఫీచర్లతో ఒప్పో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. మెయిన్‌ కెమెరాతో 108 ఎంపీ ఇమేజ్‌లు క్లిక్ చేయవచ్చు. 
 
సూపర్‌ రిజల్యూషన్‌ అల్గారిథమ్‌తో ఇది సాధ్యమవుతుంది. క్రిస్టల్‌ బ్లూ, ఇంక్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ మొబైల్స్‌ లభిస్తాయి. డెడికేటెడ్ మెమొరీ కార్డు స్లాట్‌, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్, ఇతర కనెక్టివిటీ ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.