సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Modified: బుధవారం, 30 జనవరి 2019 (18:29 IST)

షియోమీ నుండి రెడ్మీ గో... రేటు తెలిస్తే ఎగరేసి కొంటారు...

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ నుండి ఎన్నో రకాల మొబైల్‌లు మార్కెట్‌లోకి విడుదలవుతున్నాయి. అయితే తాజాగా దాని అనుబంధ సంస్థ అయిన రెడ్‌మీ దాని నుండి విడిపోయిన తర్వాత రెడ్‌మీ గో పేరుతో స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ గోతో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ గో అనేది ఆండ్రాయిడ్‌కు లైట్ వెయిట్ వెర్షన్. 
 
దీని ధర తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌లు ఎంచుకునే వారికి బేసిక్ ప్రత్యేకతలతో రెడ్‌మీ గో అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి నెలలో యూరప్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అయితే భారత్‌లో మాత్రం ఎప్పుడు రిలీజ్ కానుందో ఇంకా స్పష్టత లేదు.
 
రెడ్‌మీ గో ప్రత్యేకతలు:
డిస్‌ప్లే సైజ్: 5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1280x720 పిక్సెల్స్
ప్రాసెసర్: క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్
ఇంటర్నల్ స్టోరేజీ: 1 జీబీ
ర్యామ్: 8 జీబీ మెమొరీ
బ్యాక్ కెమెరా: 8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర: సుమారు రూ.6,500