శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 మార్చి 2021 (12:14 IST)

5జీ ఫోనును ఉపయోగిస్తున్నారా? ఐతే నెట్‌వర్క్ ఆఫ్ చేయాలట

5జీ నెట్ వర్క్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ 5జి ఉన్న చోట్ల ఆ నెట్‌వర్క్‌ను వాడితే స్మార్ట్ ఫోన్లలో బ్యాటరీ పవర్‌ అధిక వేగంతో ఖర్చవుతుందని నిర్దారించారు. బ్యాటరీ వేగంగా అయిపోతుందని తేల్చారు. అయితే 5జి అవసరం లేకపోతే ఫోన్‌లో నెట్‌వర్క్ సెట్టింగ్స్‌లో 5జీని ఆఫ్ చేసి కేవలం 4జీని మాత్రమే ఉపయోగించాలని ప్రముఖ అమెరికన్ టెలికాం కంపెనీ వెరిజాన్ వెల్లడించింది. 5జి వద్దనుకునే వారు దాన్ని ఆఫ్ చేయవచ్చని, దాంతో బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుందని తెలిపింది.
 
కానీ మార్కెట్‌లో దాదాపుగా అధిక శాతం వరకు 4జి ఫోన్లే అందుబాటులో ఉన్నాయి. 5జి ఫోన్ల సంఖ్య చాలా తక్కువ. కానీ 5జి ఫోన్లలో బ్యాటరీని ఆదా చేయాలని అనుకునేవారు ఎలాగూ 5జి మనకు అందుబాటులో లేదు కనుక దాన్ని ఆఫ్ చేస్తే బ్యాటరీని సేవ్ చేయవచ్చు. దీంతో బ్యాటరీ బ్యాకప్‌, లైఫ్ పెరుగుతాయి. కాగా మన దేశంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్‌లు ఈ ఏడాది చివరి వరకు 5జి సేవలను అందించాలని చూస్తున్నాయి.