సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (11:39 IST)

రెడ్ మీ నుంచి కొత్త ఫోన్.. వెనుక నుంచి రెండు కెమెరాలు

Redmi 9 A
రెడ్ మీ నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్‌ ఫిబ్రవరి 11వ తేదీన విడుదలైంది. ఫిబ్రవరి 11వ తేదీన భారత్‌లో ఈ ఫోనును విడుదల చేశారు. ఈ కొత్త రెడ్‌మీ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వుంది. రెడ్ మీ నుంచి విడుదలైన 9ఏ భారత్‌లో పదివేల రూపాయలకు లభిస్తుంది. 
 
రెడ్‌మీ 9ఏ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ వీ10 (క్యూ) ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. ఓక్టా కోర్ ప్రోసెసర్, మీడియా టెక్ హెలియో జీ70 చిప్ సెట్, 3జీబీ రామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే, 5ఎంపీ ప్రైమరీ కెమెరా, డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్, ఫేస్ డెటెక్షన్ వంటి పలు ఫీచర్లను కలిగివుంది.