శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (18:03 IST)

పడిపోయిన టమోటా ధరలు.. రవాణా ఖర్చులకు కూడా రావట్లేదని?

టమోటా ధరలు పడిపోవడంతో రైతులు డీలాపడిపోయారు. గతంలో మార్కెట్లో కిలో 60 రూపాయలు పలికిన టమోటా ధరలు ప్రస్తుతం భారీగా పడిపోయాయి. హోల్ సేల్ మార్కెట్లో కిలో టమోటా ధర రూ.5 నుంచి రూ.8కి పడిపోయింది. ఇక రిటైల్ మార్కెట్లో కిలో ధర రూ.10 నుంచి రూ.15కే లభిస్తోంది. టమాట ధరలు పడిపోవడంతో తమకు కనీసం రవాణా చార్జీలు కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా రెండు నెలల క్రితం పంట దిగుబడి గణనీయంగా పడిపోవడంతో బహిరంగ మార్కెట్లో టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కిలో 50-60 రూపాయల వరకు పెరగడంతో.. సామాన్యుడు వాటిని కొనకుండా వదిలేశాడు. అయితే ప్రస్తుతం ఈ కారణంగా టమోటా దిగుమతి పెరిగింది. మార్కెట్లోకి లారీల కొద్దీ టమోటాలు వచ్చేశాయి. పనిలో పనిగా ధరలు మాత్రం తగ్గిపోయాయి.