ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (11:26 IST)

పిల్లలు సమోసాలను లాగిస్తున్నారా.. ఇవి తప్పవు జాగ్రత్త..!

samosa
పిల్లలు ఎక్కువ సమోసాలను తింటున్నారా.. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సమోసా తిన్నప్పుడు, దానిలోని చెడు కొవ్వు, ట్రైగ్లిజరైడ్ రక్తనాళాలకు అంటుకుంటుంది. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. 
 
అంతేగాకుండా ఇది గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో అధిక బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సమోసాలు తినడం వల్ల మధుమేహం, హైబీపీ వంటి వ్యాధులు వేగంగా పెరుగుతాయి.
 
సమోసాలు కొనాలని షాపుకు వెళ్తున్నారా... అయితే ముందుగా మీరు చూడాల్సింది నూనెను. సమోసాలు మళ్లీ మళ్లీ అదే నూనెలో వేయించడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవు. ఇందులో ఉపయోగించే బంగాళాదుంపలు పాడైతే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.