శుక్రవారం, 6 ఫిబ్రవరి 2026
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 డిశెంబరు 2014 (15:00 IST)

పిల్లలకు స్ఫూర్తిదాయక కథలు చెప్పండి!

ఎప్పుడూ విసుగుపుట్టే లెక్చరర్లు ఇవ్వడం, విమర్శలు చేయడానికి బదులు వారికి స్ఫూర్తిదాయకమైన కథలు చెప్తుండాలి. ఏదైనా చేయగలనన్న పెద్దల కథల్ని వారికి గుర్తుచేస్తుండాలి. స్ఫూర్తిని ఇచ్చే కొటేషన్లు వారికి చెప్తుండాలి. వాటిని ఎదురుగా చెప్పి బోర్ కొట్టించకుండా అద్దంమీద అతికించండి. లంచ్ బాక్స్‌లో స్లిప్ పెట్టండి. ఈ చిన్నచిన్న కొటేషన్లు, సుదీర్ఘ లెక్చర్లకంటే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తాయని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
 
అలాగే భవిష్యత్‌కు సంబంధించి ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నా పిల్లల అభిప్రాయాలకూ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ స్వేచ్ఛను ఇంట్లోనే కాదు.. పేరెంట్, టీచర్ మీటింగ్‌లు ఓపెన్ హౌస్‌లలో సైతం చేస్తుండాలి. నిర్ణయాల చర్చల్లో వారినీ స్వతంత్ర్యంగా పాల్గొనేలా చేయాలి. 
 
పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులది ఎంత కీలకమైన పాత్రో స్కూల్ వాతావరణానిది, టీచర్లదీ అంతే అవుతుంది. టీచర్లే తమకు స్ఫూర్తి అని విజయాలు సాధించిన వారు చెప్పే పలుకులే ఇందుకు ఉదాహరణలు. మొగ్గను ఎప్పుడూ స్వేచ్ఛగా విడనివ్వాలి. 
 
బలవంతంగా రేకలు విప్పే ప్రయత్నం చేస్తే పువ్వు సహజతత్వాన్ని కోల్పోతుంది. పువ్వు అందంగా, బలంగా వికసించడానికి కావాల్సిన పునాది ఏర్పాటు చేస్తే చాలు. ఎందుకంటే పిల్లలు పువ్వులవంటివారే..!