మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 16 మార్చి 2019 (15:29 IST)

పిల్లలు ఉన్నట్టుండి ఏడుస్తున్నారా.. అయితే ఇలా చేయిండి..?

కొందరు పిల్లలు ఉన్నట్టుండి ఏడవడం మొదలుపెడతారు. ఎందుకు ఏడుస్తున్నావని ఎంత అడిగినా చెప్పరు. అలాంటప్పుడు పట్టించుకోనట్టు వదిలేయడం, లేదా కొట్టడం వంటివి పరిష్కారం కాదంటున్నారు నిపుణులు. పిల్లలు ఎందుకు అలా చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
 
పిల్లలు వారిఅసక్తతనూ, కోపాన్నీ, ఆవేశాన్ని ఏడుపు రూపంలో ప్రదర్శిస్తారు. ఆ సమయంలో వారు చెప్పిన మాట వినకపోవడం, ఇంకా మారాం చేయడం వంటివి చేస్తారు. దీన్ని మీరు ఇలానే వదిలేస్తే.. వారు ఇలానే కొనసాగిస్తారు. కనుక కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలనేది వారికి నేర్పించాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనేది వారికి వివరిస్తే సరిపోతుంది.
 
పెద్దవారిలానే పిల్లలకు కూడా ఎంతో కొంత ఒత్తిడి సహజంగా ఉంటుంది. దీని కారణంగానే పిల్లలు సరిగ్గా నిద్రపోక రాత్రుళ్లు ఏడవడం మొదలుపెడతారు. చదువులు కావచ్చు, స్నేహితులతో గొడవ కావచ్చు.. ఎలాంటిదైనా వారు ఒత్తిడిగానే భావిస్తారని మరవకూడదు. అలాకాకుంటే.. మరేదైనా విషయానికి భయపడి ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుక మీరు ఆ కారణాలు తెలుసుకుని మీ పిల్లలు ఒత్తిడి నుండి బయటపడేలా చేయాలి.
 
పిల్లలు వారి కోపాన్ని, అసంతృప్తిని కొన్నిసార్లు ఏడుపు ద్వారా వ్యక్తం చేస్తుంటారు. కాబట్టి అసలు సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అడిగితే వెంటనే చెప్పరు కానీ.. ఏడుపు ఆపేశాక నిదానంగా అడిగితే చెప్తారు. అప్పుడు వారికి పరిష్కారాన్ని వివరంగా చెబితే అర్థం చేసుకుంటారు. ఇక మరోసారి ఇలా ఏడవరు.