1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథలు
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (14:41 IST)

దానం చేయని వాని సంపద...?

దానము సేయ గోరిన వదాన్యున కీయగ శక్తి లేనిచో
నైన బరోపకారమునకై యొక దిక్కున దెచ్చియైన నీ
బూనును మేఘ డంబుధికి బోయి జలంబుల దెచ్చియీయడే
వాన సమస్తజీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా...
 
దానము చేయదలచిన ధర్మాత్ముడు తనకు శక్తిలేకపోయినను వెరొకరి వద్దనైనను దెచ్చి యిచ్చును. మేఘము సముద్రమునకు బోయి నీరు తెచ్చి వాన రూపమున అందరు జనులకు యిచ్చుచున్నది గదా..
 
దానము చేయనేరని యధార్మికు సంపద యుండి యుండియన్
దానె పలాయనంబగుట తథ్యము బూరుగుమాను గాచినన్
దాని ఫలంబు లూరక వృధా పడిపోవవె యెండి గాలిచే
గానలలోన నేమిటికి గాక యభోజ్యము లౌట భాస్కరా..
 
బూరుగుచెట్టు బాగుగా ఫలించినను దాని ఫలములు తినరానివగుటచే అవి అడవిలో ఎవరికి ఉపయోగపడక ఎండిపోయి, గాలికి నేలరాలిపోవును. అట్లే ఒకరికి దానము చేయని వాని సంపద యొకప్పుడున్నను మరి యొకప్పుడు తొలగిపోవును.