బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథలు
Written By
Last Updated : గురువారం, 24 జనవరి 2019 (14:08 IST)

కామము తీర్చుమని కోరగా...?

అంగన నమ్మరాదు తనయంకెకు రాని మహాబలాడ్యు వే
భంగుల మాయ లొడ్డి చెఱుపం దలపెట్టి; వివేకియైన సా 
రంగధరుం బదంబులు కరంబులు గోయ గజేసె దొల్లి చి
త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులుపన్ని భాస్కరా...
 
పూర్వము చిత్రాంగియను ఆమె తన కామోద్రేకముచే బుద్ధిమంతుడైన సారంగధరుని, తన కామము తీర్చుమని కోరగా, నతడందులకు నిరాకరించెను. ఆమె ఎన్నో దుస్తంత్రములు పన్ని అతని కాలు చేతులు ఖండింపజేసెను. స్త్రీలు తమ ఉద్దేశముల కనువుగా వర్తింపనివాడెంత బలాధ్యుడైనను వానిని పాడుచేయుటకే ఆలోచిస్తారు.