బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కృష్ణా పుష్కరాలు 2016
Written By JSK
Last Modified: గురువారం, 11 ఆగస్టు 2016 (22:20 IST)

పుష్క‌ర పురోహితులు వ‌చ్చేశారు... గుర్తింపు కార్డులు ఏవీ?

విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో ప్రధాన భూమిక పోషించే బ్రాహ్మణులు వివిధ జిల్లాల నుంచి విజయవాడ చేరుకున్నారు. వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాల్సి ఉంది. సాయంత్రం అయినా వారికి ఇంతవరకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. సుమారు 4 వేల మంది బ్రాహ్మణలు వచ్చి రైల్

విజయవాడ : కృష్ణా పుష్కరాల్లో ప్రధాన భూమిక పోషించే బ్రాహ్మణులు వివిధ జిల్లాల నుంచి విజయవాడ చేరుకున్నారు. వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాల్సి ఉంది. సాయంత్రం అయినా వారికి ఇంతవరకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. సుమారు 4 వేల మంది బ్రాహ్మణలు వచ్చి రైల్వే స్టేషన్‌లో ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. వారికి గుర్తింపు కార్డులు ఇస్తే వారికి కేటాయించిన ఘాట్‌లకు వెళ్లి తమ విధులు (పిండ ప్రదానాలు) నిర్వహించనున్నారు. 
 
అయితే సాయంత్రం అయినా గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడంతో వారు ఆందోళన‌ వ్యక్తం చేశారు. గురువారం ఉదయం 6 గంటలకు అప్లికేషన్లు తీసుకున్నారని, ఇంతవరకు ఇవ్వలేదని, ఇక్కడ కనీస సదుపాయాలు లేవని, పెద్దవాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని పండితులు అన్నారు. ఇంత నిర్లక్ష్యం తగదని పురోహితులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.