ఎన్ని యుగాలైనా... నీతోటిదే నా ప్రేమరాగం

love
ఐవీఆర్| Last Modified శనివారం, 28 డిశెంబరు 2019 (21:01 IST)
ప్రియతమా,
 
ప్రకృతి పసిడి కాంతులు వెదజల్లే అందానివి
భానుడు విసిరే లేలేత కిరణాల వెచ్చదానానివి
పిల్లగాలులు చల్లగా విసిరే వింజామరవు
తెల్లని మబ్బులు వర్షించే తుషారానివి
సంధ్యా కాంతి నుంచి నాకోసం వచ్చే కాంతిరేఖవు
వెన్నెల కాంతుల్లో నన్ను కవ్వించే జాబిలమ్మ నీవు
నడిరేయి నన్ను చుట్టేసే నక్షత్రాల అందాల లోకం నీవు
వేవేల జన్మలైనా నాకోసం ఎదురుచూసే నీ రూపం
 
కమనీయం
రమణీయం
ఎన్ని యుగాలైనా
నీతోటిదే నా ప్రేమరాగం
 దీనిపై మరింత చదవండి :