శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2023 (09:35 IST)

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి

bridge construction
bridge construction
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన గిర్డర్ అకస్మాత్తుగా కూలడంతో ఏకంగా 14 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. 
 
థానే జిల్లా షాపూర్‌లో సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనులకు సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన గిర్డర్ యంత్రం ఒక్కసారిగా కార్మికులపై కూలింది. ఈ ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
గిర్డర్ యంత్రాన్ని అనుసంధానించే క్రేన్, స్లాబ్ 100 అడుగుల ఎత్తు నుంచి కిందపడి పెను ప్రమాదం సంభవించింది. గాయపడిన వారితో పాటు మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. 
 
పోలీసు సిబ్బంది, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయ, సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.