సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (11:52 IST)

కర్నాటకలో 21 మంది నర్సింగ్ విద్యార్థులకు పాజిటివ్

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా 40 వేలకు ఏమాత్రం తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో 21 మంది నర్శింగ్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ సోకింది. వీరంతా కేరళ నుంచి కర్నాటకకు వచ్చిన విద్యార్థులు కావడం గమనార్హం. 
 
విద్యార్థినులంతా పేయింగ్‌ గెస్టులు ఉండగా భవనాన్ని మూసివేశారు. 24 మంది ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించారు. విద్యార్థునులు కాటిహల్లి పారిశ్రామిక ప్రాంతంలో నర్సింగ్ కళాశాలలో చదువుతున్నారు. 21 మంది కరోనా సోకిన విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు జూలై 26కి ముందు హసన్‌కు వచ్చారు. 
 
వారంతా ప్రతికూల ఆర్‌టీపీసీఆర్‌ సర్టిఫికెట్లను సమర్పించారు. కొవిడ్‌ లక్షణాలు కనిపించగా గత మంగళవారం ఓ విద్యార్థికి ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం కరోనా సోకిన విద్యార్థినులను క్వారంటైన్‌కు తరలించారు.