తూగోలో 364 - కర్నూలులో 11 : ఏపీ కరోనా బులిటెన్
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. గత 24 గంటల్లో మొత్తం 78,992 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 2,058 మందికి పాజిటివ్‌గా తేలింది.
అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 364 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 325, చిత్తూరు జిల్లాలో 284, ప్రకాశం జిల్లాలో 242 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 11 కొత్త కేసులు గుర్తించారు. అలాగే, 2,053 మంది కరోనా నుంచి కోలుకోగా, 23 మంది మరణించారు.
తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 13,377 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,66,175 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,31,618 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 21,180 మందికి చికిత్స జరుగుతోంది.